←Back
శ్రీ విజయానందనాథ కృత శ్రీ వేంకటేశ్వర దండకం 1953
శ్రీ వెంకటేశా | ప్రభో దేవ దేవా| మహాశేష శైలాస వాస| ప్రభో శ్రీనివాస|గిరీశాది దేవై స్సదా పూజిత నూన పాదాబ్జ ఇందీ వర శ్యామ శ్రీ ఇందిరా భాస మాన |
సమాన| సదా సర్వ గీర్వాణ సంఘ ప్రమోదాంత రంగా | శుభాంగా ||
సముత్తుంగగా గంగా మహావీచి ఫేనర్ద్ర పాదాబ్జ నిష్ట్యూత ధార సుధాపూర రారా |
మహోదార | వీరాధివీరా| వరారోహ పద్మావతి మాన సాంభోజ హేళీ | దయాశీలీ |
లీలా గృహితా ఖిలానంత లోకాధికార | కృపోద్దూత మోహన్దాకార||
శుభాకార |కారుణ్య ధార | నిరాధార | సమ్మోహనాకార| శ్రీ వేంకటేశా | మహేశా|
పరేశా |సురేశాది బృందారక బృందకూట కోటీర మాణిక్య నిరాజిత స్వచ్ఛ పాదారవిందా |
దయాసాంద్ర | అర్ధ్రాంతరంగా | నట దివ్య గానైక్య బృందై స్సమారాధితా దేవతా చక్రవర్తీ |
దయం చూడవే | వేద వేదాంత వేద్య||
సదా హృద్య పద్యంబులన్ నిన్ను కీర్తించి నీలోన నేనుండి
నాలోన నిన్నుంచి తాదాత్మ్యముంబొంది సేవింప నున్నాడ |
భక్తార్తహారి | దయం చేదుకో ఆదుకో మేలుకో ఏలుకో పాపకర్మంబులన్
జయ నిత్యుత్తమౌ మానసంఋన్ సదా నీ అధీనంబులో నుండగా చేయవే|
నా మురాలింపవే | కావవే దీనునిన్||
బ్రోవవే మాధవ | సాధువాదంబులన్ నాకు ఎల్లప్పుడూ బోధ జయంగదే |
దేహయాత్రావసానంబులంన్ నీదు పాదారవిందంఋలన్ భావనం జేయగా శక్తి నియంగదే |
అచ్యుతా| అనంత| సంకర్షణ| మాధవ |దేవ దేవ | నమస్తే | నగేశా నమస్తే బుధేశా నమస్తే|
పునస్తి నమస్తే నమః||
కొమ్మా వెంకటరమణ సన్మానము తోడ నీకు |సంకటహరణా ముమ్మారులెవరు పాడిన ఇమ్మావారాలకు ఇష్ట సుఖమ్ముల్ ||
